జనసేన కండువా కప్పుకున్న జేడీ లక్ష్మీనారాయణ..!

Written By Xappie Desk | Updated: March 18, 2019 10:43 IST
జనసేన కండువా కప్పుకున్న జేడీ లక్ష్మీనారాయణ..!

జనసేన కండువా కప్పుకున్న జేడీ లక్ష్మీనారాయణ..!
 
వైసీపీ అధినేత జగన్ కేసులో కీలకంగా వ్యవహరించి వార్తల్లో సంచలనంగా నిలిచిన మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రయాణం గురించి గత కొన్ని రోజుల నుండి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ తాజాగా జనసేన పార్టీలో చేరి అందరికి షాక్ ఇచ్చారు. గత కొంత కాలం నుండి తెలుగుదేశం పార్టీలోకి జేడీ వెళ్తున్నారని వస్తున్నా వార్తలకు చెక్ పెట్టి పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్లడంతో ఆంధ్రాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
ఈ నేపథ్యంలో పార్టీలోకి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ నీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన రాజకీయాల కోసం మరియు సామాన్యుల బతుకుల్లో వెలుగు నింపడం కోసం సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చే వారికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా జేడీ లక్ష్మీనారాయణ పార్టీ లోకి రావటం … పార్టీకి కొంచెం భాగం పెరిగిందని అన్నారు. అయితే తాజాగా జనసేన పార్టీ లోకి జె డి లక్ష్మీనారాయణ వెళ్ళటంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు..జెడి టీడీపీ లోకి వెళ్ళిన మరియు జనసేన లోకి వెళ్ళిన ఒక పార్టీలో కి వెళ్ళినట్లే అని... రెండు పార్టీలకు చంద్రబాబే అధ్యక్షుడిని... కామెంట్లు చేస్తున్నారు.
Top