నేను తప్పు చేశాను క్షమించండి..జగన్ వద్ద బుట్టా రేణుక..!

Written By Xappie Desk | Updated: March 18, 2019 10:46 IST
నేను తప్పు చేశాను క్షమించండి..జగన్ వద్ద బుట్టా రేణుక..!

నేను తప్పు చేశాను క్షమించండి..జగన్ వద్ద బుట్టా రేణుక..!
 
2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పార్లమెంటు స్థానాన్ని గెలిచిన బుట్టా రేణుక... ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. అధికార పార్టీ టీడీపీ ఫిరాయింపు రాజకీయాల్లో భాగంగా వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ను తన పార్టీలో చేర్చుకుని గతంలో వైసీపీ పార్టీ పై మరియు జగన్ పై అనేక కామెంట్లు చేశారు. అయితే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడం మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొత్తం అంతా జగన్ ని నమ్మడం తో బుట్టా రేణుక పశ్చాత్తాపపడి ఇటీవల లోటస్పాండ్లో వైసీపీ అధినేత జగన్ ని కలిసి క్షమించమని చెప్పి వైసిపి పార్టీలోకి తిరిగి చేరి తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు.
 
భర్తతో కలిసి పార్టీలో జాయిన్ అయిన బుట్టా రేణుక మాట్లాడుతూ...నాడు బీసీ మ‌హిళ అయిన త‌న‌కు, జ‌గ‌న్ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే, తాను టీడీపీలో చేరి పెద్ద‌ త‌ప్పు చేశాన‌ని, అందేకే త‌గిన శిక్ష అనుభ‌వించాన‌ని, మ‌నుషుల‌ను మ‌భ్య‌పెట్టి, వారిని మాన‌సికంగా వేధించ‌డ‌మే టీడీపీ అస‌లు ర‌హ‌స్య‌మ‌ని బుట్టా రేణుక తెలిపారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మొత్తం జగన్ వెంట ఉన్నారని బుట్టా రేణుక పేర్కొన్నారు.
Top