పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే పోటీ..?

By Xappie Desk, March 19, 2019 11:44 IST

పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే పోటీ..?

పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే పోటీ..?
 
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మరియు వైసిపి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే జనసేన పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది రెండు దఫాలుగా. ప్రకటించిన రెండు లిస్టులో ఎక్కడా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారో తెలుపలేదు. మరోపక్క రాష్ట్రమంతటా పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్రమంలో తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం పవన్ పోటీ మాత్రం విశాఖ జిల్లా గాజువాక నుంచే ఉండబోతుందని తెలుస్తుంది.
 
ఈ నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లో విడుదల చేయబోతున్నా పూర్తిస్థాయి జాబితాలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఉంటుందని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క విశాఖపట్టణంలో జనసేన పార్టీకి మంచి బలం ఉందని...అభిమానులు కూడా ఎక్కువ అన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా అభివృద్ధి అవుతున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కచ్చితంగా చుట్టుపక్కల జనసేన పార్టీ తరుపున నిలబడుతుందో అభ్యర్థులకు కూడా కొంచెం బలం వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా చిట్టచివరిగా విడుదల చేయబోతున్నారు పూర్తిస్థాయి లిస్టులో పవన్ కళ్యాణ్ గాజువాక ప్రాంతం నుండి పోటీ చేస్తారో లేదో అన్న ఉత్కంట ప్రజలందరిలో నెలకొంది.Top