టైమ్స్ నౌ సర్వే లో స్పష్టంగా వైసీపీ పార్టీ హవా..!

Advertisement

by Xappie Desk | March 19, 2019 11:50 IST
Follow Xappie
టైమ్స్ నౌ సర్వే లో స్పష్టంగా వైసీపీ పార్టీ హవా..!

టైమ్స్ నౌ సర్వే లో స్పష్టంగా వైసీపీ పార్టీ హవా..!
 
తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద అన్ని అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ వెంటనే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో వైసీపీ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ ఎక్కడ అడుగుపెట్టిన గాని ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు...ఇసుక వేస్తే రాలనంత జనం వస్తుండటంతో ప్రత్యర్థి పార్టీల నాయకులకు మరియు పోటీచేసే అభ్యర్థులకు జగన్ దూకుడు చూసి వణుకు పుడుతోందని.. గురుపోతు వేగం వంటి వేగంగా.. ఎన్నికల ప్రచారంలో జగన్ దూసుకెళ్తున్నటూ ఇతర పార్టీలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు కామెంట్ చేస్తున్నారు.
 
గతంలో జగన్ ని ప్రజల దృష్టిలో దొంగ గా మరియు ఒక నేరస్తుడిగా చిత్రీకరించిన ప్రత్యర్థులకు దిమ్మ తిరిగిపోయేలా రాష్ట్ర ప్రజలంతా వైసిపి పార్టీని బలంగా నమ్మడం...జగన్ ని ఆదరిస్తున్న క్రమంలో జాతీయ సర్వేలో వైసీపీకి అంచనాలకు మించి ఫలితాలు రావటం చూసి వైసీపీ పార్టీలో ఉన్నా శ్రేణులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇప్పటికే చాలా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ క్రమంలో తాజాగా టైమ్స్ నౌ సర్వే వారు నిర్వహించిన సర్వేలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను వైసీపీకి 22 నుంచి 23 స్థానాలు పక్కా అని అలాగే చంద్రబాబు కి 3 లేదా 2 స్థానాలు వచ్చేలా ఉన్నాయని చెప్తున్నారు. వీరి సర్వే నిజమే అయితే ఇక రాష్ట్రంలో జగన్ కి తిరుగు ఉండదనే చెప్పాలి. మొత్తం మీద ఈ సర్వేల ఫలితాలు చూసి రాష్ట్ర వైసీపీ పార్టీ క్యాడర్ మొత్తం మంచి జోష్ మీద ఉంది.


Advertisement


Advertisement

Top