జగన్...నువ్వు లోటస్ పాండ్ కే పరిమితం: చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 19, 2019 11:55 IST
జగన్...నువ్వు లోటస్ పాండ్ కే పరిమితం: చంద్రబాబు..!

జగన్...నువ్వు లోటస్ పాండ్ కే పరిమితం: చంద్రబాబు..!
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఒంగోలులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా గత ఎన్నికలలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు చెప్పినట్లు చేశామని రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చామని పేర్కొన్నారు. అంతేకాకుండా రాబోతున్న ఎన్నికలలో టీడీపీ ని మళ్లీ గెలిపిస్తే ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీరు అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
 
రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా లేనంత అభివృద్ధి రాష్ట్రంలో చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంత ముందుకు దూసుకు వెళ్తున్న నేపథ్యంలో కెసిఆర్ చూసి ఓర్చుకోలేక పోయారని జగన్- కెసిఆర్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని..చంద్రబాబు ఆరోపించారు. త్వరలో రాబోతున్న ఎన్నికలలో జగన్ ఓడిపోతారని... ఇక హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్ ఇంటికే పరిమితమవుతారని జగన్ పై దారుణంగా విమర్శలు చేశారు. అంతే కాకుండా భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా... జగన్ కి పట్టిన గతే పడుతుందని చంద్రబాబు సంచలన కామెంట్ చేశారు.
Top