ఏపీ టీడీపీ కి మరో షాక్..చేతులెత్తేసిన ఎమ్మెల్యే..!

Written By Xappie Desk | Updated: March 19, 2019 12:01 IST
ఏపీ టీడీపీ కి మరో షాక్..చేతులెత్తేసిన ఎమ్మెల్యే..!

ఏపీ టీడీపీ కి మరో షాక్..చేతులెత్తేసిన ఎమ్మెల్యే..!
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో నోటికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చినా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకపోవడం తో ప్రతిపక్ష నేత జగన్ గత ఎన్నికల హామీలను ప్రతి సందర్భంలోనూ ప్రతి భారీ బహిరంగ సభలోనూ ప్రస్తావిస్తూ అధికారపార్టీ టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు.
 
ఇదే క్రమంలో రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన మంచి పనులు జరుగుతాయి..మంచి విషయాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో జగన్ చేస్తున్న ప్రసంగాలు ఆంధ్ర ప్రజల్లోకి బలంగా వెళ్లటంతో వైసీపీ పార్టీ రాబోతున్న ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ప్రతి సర్వేల్లోనూ ఫలితాలు రావడంతో అధికార పార్టీ టిడిపికి చెందిన నాయకులు చాలామంది ఇప్పటికే వైసిపి పార్టీ కండువా కప్పుకున్నారు . ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. శ్రీశైలం నుంచి పోటీ చేయలేనని ఆ నియోజకవర్గానికి అభ్యర్ధి అయిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రకటించారు.
 
ఆయన గతసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికై, టిడిపిలో చేరారు. తాజాగా నియోజకవర్గంలో వస్తున్న సర్వేల లో టిడిపి గెలిచే పరిస్థితి లేదన్న సంకేతాలు వస్తుండడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేసి తనను ప్రజలు క్షమించాలని ,తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని పేర్కొన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా తెలిపానని చెప్పారు. మొత్తం మీద బుడ్డా రాజశేఖర్ రెడ్డి చివరి క్షణంలో చేతులెత్తేయడంతో తెలుగుదేశం పార్టీ పెద్ద తలకాయలకు మతి పోయినట్లు అనిపించిందని టిడిపి నేతల నుండి వస్తున్న సమాచారం.
Top