వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!

By Xappie Desk, March 20, 2019 10:14 IST

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!
 
వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఇటీవల దారుణంగా కొంతమంది దుండగుల చేతిలో హత్య చేయబడ్డారు. ఎన్నికల ప్రచారానికి కొద్దిరోజుల ముందు జరిగిన ఈ ఘటన ఆంధ్ర రాజకీయాలలో చాలా సంచలనాలు సృష్టించిన విషయం మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఈ ఘటనపై తెలుగుదేశం మరియు వైసిపి పార్టీలు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో వివేకానంద రెడ్డి హత్య కేసు హైకోర్టుకు చేరుకుంది. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని హైకోర్ట్ ను ఆశ్రయించారు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.
 
తన బాబాయ్ హత్య కేసును చిన్నదిగా చూపించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ పిటీషన్లో పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.Top