నామినేషన్ కి ముహూర్తం ఖరారు చేసుకున్న పవన్ కళ్యాణ్..!

Written By Xappie Desk | Updated: March 20, 2019 10:24 IST
నామినేషన్ కి ముహూర్తం ఖరారు చేసుకున్న పవన్ కళ్యాణ్..!

నామినేషన్ కి ముహూర్తం ఖరారు చేసుకున్న పవన్ కళ్యాణ్..!
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ప్రాంతం గాజువాక నుండి మరియు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం నుండి పోటీ చేయడానికి ఖరారైన విషయం మనకందరికీ తెలిసినదే. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ తాజాగా పోటీలోకి దిగడం తో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే నామినేషన్ల ప్రక్రియ వేగవంతం కావడంతో నామినేషన్లు వేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
 
మార్చి 21న విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు పవన్ కళ్యాణ్. 21 ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట మధ్య నామినేషన్ దాఖలు చెయ్యనున్నట్లు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆ మరుసటి రోజు అంటే మార్చి22న మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటలలోపు పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. నామినేషన్ల ప్రక్రియ కు భారీ ఎత్తున జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు వేడుకల చేయడానికి కార్యక్రమాలు రూపొందించుకుంటున్నట్లు సమాచారం.
Top