రైతులకు సంచలన హామీ ప్రకటించిన వైయస్ జగన్…!

Written By Xappie Desk | Updated: March 20, 2019 10:31 IST
రైతులకు సంచలన హామీ ప్రకటించిన వైయస్ జగన్…!

రైతులకు సంచలన హామీ ప్రకటించిన వైయస్ జగన్…!
 
వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీ లకు దిమ్మతిరిగిపోయే విధంగా దూసుకుపోతున్నారు. పక్కా ప్రణాళికలతో అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలు ప్రకటించిన జగన్ వెంటనే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అధికారపార్టీకి మరియు ఇతర పార్టీలకు షాక్ ఇచ్చారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో సభలో పాల్గొన్న జగన్ తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం కొయ్యలగూడెంలో పాల్గొన్న బహిరంగ సభలో ఆంధ్ర ప్రదేశ్ రైతాంగానికి సంబంధించి కీలక హామీ ప్రకటించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబానికి తన ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారాన్ని అందిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. ప్ర‌చార స‌భలో జ‌గ‌న్ మాట్లాడుతు …నాన్న‌గారు దివంగ‌త నేత వైఎస్ఆర్ రైతుల‌కు ఎంతో సేవ చేశార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇకపై రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని చెప్పారు. పొరపాటున ఓ ఒక్క రైతు అయిన మ‌రణించిన ఆ రైతు కుటుంబానికి ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు. రైతులకు అండగా నిలచే ప్రభుత్వం రావాలన్న లక్ష్యం తనదని, ఈ డబ్బుపై ఎవరికీ అధికారం ఉండదని అన్నారు. ఈ సంద‌ర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు జ‌గ‌న్‌.
Top