ట్విట్టర్లో చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన ప్రశాంత్ కిషోర్..!

Written By Xappie Desk | Updated: March 20, 2019 10:37 IST
ట్విట్టర్లో చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన ప్రశాంత్ కిషోర్..!

ట్విట్టర్లో చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన ప్రశాంత్ కిషోర్..!
 
వైసిపి అధినేత జగన్ రాజకీయ సలహాదారుడు గా ఉంటూ 2019 ఎన్నికలకు వైసీపీ పార్టీ కి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పై ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు దారుణంగా కామెంట్లు చేయడంతో చంద్రబాబు చేసిన కామెంట్లపై ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదికగా ప్రతిస్పందించారు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ చేయించుకున్న సర్వేలను ఉదహరిస్తూ..చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ...ఏపీలో బీహార్ నుంచి రౌడీల‌ను జ‌గ‌న్ తెప్పించి విధ్వంసం సృష్టిస్తున్నార‌ని పీకే పై మాట‌ల దాడి చేశారు చంద్ర‌బాబు.
 
మ‌న డేటాను పీకే దొంగ‌లించి జ‌గ‌న్‌కు అందించార‌ని విమ‌ర్శించారు చంద్ర‌బాబు. దీనిపై ప్ర‌శాంత్ కిషోర్ కూడా అదే రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఏపీ ప్ర‌జ‌లకు మీరు ఏం చేశార‌ని మీకు ఓటు వేయ్యాలో చెప్పాలి కాని, ఇలా మాపైదాడికి దిగ‌డం ఏంట‌ని పీకే చంద్ర‌బాబును ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. క‌ళ్ల ఎదుట మీకు ఓట‌మి క‌నిపిస్తుంది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయ‌న ఫైర్ అయ్యారు. బీహార్ కు వ్యతిరేకంగా మీ దురభిమానం మరియు దురభిమానాన్ని చూపించే అవమానకరమైన భాషని ఉపయోగించకుండా, మీకు మళ్లీ ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలన్న విషయంపై దృష్టిని సారించాలని కోరుతున్నాన‌ని త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చారు.
Top