జాతీయ సర్వే సంస్థ పై మండిపడ్డ చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 20, 2019 10:40 IST
జాతీయ సర్వే సంస్థ పై మండిపడ్డ చంద్రబాబు..!

జాతీయ సర్వే సంస్థ పై మండిపడ్డ చంద్రబాబు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటీవల జాతీయ సర్వే సంస్థ అయిన టైమ్స్ నౌ ప్రకటించిన ఫలితాల లో వైసీపీ పార్టీ కి మెజార్టీ స్థానాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్లో జగన్ హవా మొదలవుతుందని ప్రకటించడంతో టీడీపీ అధినేత టైమ్స్ నౌ సర్వే సంస్థ పై తాజాగా ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో సంచలన కామెంట్ చేశారు. టైమ్స్ నౌ సర్వే సంస్థ బూటకపు సర్వే ఫలితాలు వెల్లడించిందని... మొత్తం దొంగ సర్వే అంటూ దారుణమైన కామెంట్లు చేశారు చంద్రబాబు.
 
అంతేకాకుండా రాబోతున్న ఎన్నికలలో ఎన్ని కుట్రలు పన్నినా, టిడిపి గెలుపును ఆపలేరని ఆయన అన్నారు. ప్రజలలో తెలుగుదేశం పై సానుకూలత ఉందని ఆయన అన్నారని లీక్ ఇచ్చారు. అందరి అబిప్రాయాలు తీసుకునే గెలుపు గుర్రాలను ఎంపిక చేశానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి రాబోతున్న ఎన్నికల్లో కూడా టీడీపీ కే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు చంద్రబాబు.
Top