రసవత్తరంగా మారిన గుడివాడ రాజకీయం..!

Written By Xappie Desk | Updated: March 22, 2019 10:07 IST
రసవత్తరంగా మారిన గుడివాడ రాజకీయం..!

రసవత్తరంగా మారిన గుడివాడ రాజకీయం..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో వైసిపి టిడిపి పార్టీలు పాగా వేయాలని వ్యూహాలు..ప్రతివ్యూహాలతో ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ అంది వస్తున్న అన్ని అవకాశాలను పుచ్చుకోవడానికి మరియు ఎలాగైనా వైసీపీ పార్టీ అభ్యర్థి కొడాలి నాని ని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది టిడిపి.
 
ఇదే క్రమంలో కొడాలి నాని ఈసారి కూడా గుడివాడలో ఎగిరేది వైసీపీ పార్టీ జెండా అని చాలా ఘంటాపథంగా చెబుతున్నారు. మరోపక్క గుడివాడ ప్రజలు కూడా వైసీపీ పార్టీకి మరియు కొడాలి నాని పై నమ్మకం గానే ఉన్న నేపథ్యంలో...గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి స్వాధీనం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ని పార్టీ తరఫున కొడాలి నాని పై పోటీ చేయడానికి రంగంలోకి దింపిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుడివాడలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కృష్ణాజిల్లా యే గాక మరియు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. అయితే ఎవరు వచ్చినా గానీ గుడివాడలో నాని నిమాత్రం ఓడించే ప్రసక్తి లేదని ఆ ప్రాంతంలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.
Top