రాయలసీమలో భగ్గుమన్న ఫ్యాక్షన్..!

By Xappie Desk, March 22, 2019 10:13 IST

రాయలసీమలో భగ్గుమన్న ఫ్యాక్షన్..!

రాయలసీమలో భగ్గుమన్న ఫ్యాక్షన్..!
 
రాయలసీమ ప్రాంతంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ మెజార్టీ స్థానాలు గెలవడంతో రాబోతున్న ఎన్నికలలో కూడా అదే స్థాయిలో విజయావకాశాలు వస్తున్న నేపథ్యంలో వైసిపి పార్టీని ఎలాగైనా అరికట్టాలని అధికార పార్టీ టీడీపీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగిస్తూ రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైసీపీ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కడప లో జరుగుతున్న పరిణామాలను బట్టి పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ కి చెందిన వివేకానంద రెడ్డి హత్య చెయ్యబడడంతో ఇప్పుడు కడప జిల్లాలో రాజకీయాలు మొత్తం రక్తసిక్తం అవుతున్నాయి.
 
కడప జిల్లాలో వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూసే వివేకానందరెడ్డిని హతమారిస్తే ఖచ్చితంగా కడప జిల్లాలో రాజకీయాలు చేయవచ్చని వైసీపీ పార్టీ మెజార్టీ స్థానాలు తగ్గించవచ్చని భావించిన ప్రత్యర్థులు ఇటీవల వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడంతో ఇప్పుడు కడప జిల్లాలో మొత్తం ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు చేతిలో ఉన్న అధికారాన్ని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని నేపథ్యంలో కడప జిల్లాలో ఉన్న సామాన్య ప్రజలు అధికార పార్టీపై మండిపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో అభివృద్ధి చేసి రాజకీయాలు చేయాలని కత్తి పట్టి రక్తంతో రాజకీయాలు చేస్తే అర్థం ఉండదని రౌడీ కి రాజకీయ నేతకు తేడా ఉండదని టీడీపీ పార్టీని ఉద్దేశించి కడప జిల్లాలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.Top