టిడిపి పార్టీలో చేరిన అతికొద్ది రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ..?

Written By Xappie Desk | Updated: March 22, 2019 10:21 IST
టిడిపి పార్టీలో చేరిన అతికొద్ది రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ..?

టిడిపి పార్టీలో చేరిన అతికొద్ది రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ..?
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన హర్ష కుమార్ ఇటీవల టీడీపీలో చేరారు. అయితే పార్టీలో తగిన గౌరవం తగ్గకపోవడంతో మాజీ ఎమ్.పి హర్షకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారని వార్తలు వస్తున్నాయి. అంతేకాక తెలుగుదేశం, జనసేన మద్య రహస్య పొత్తు ఉందని ఆయన ఆరోపించారు. తమ మధ్య అవగాహన లేదని పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయగలరా అని ఆయన సవాల్ చేశారు.
 
జనసేన, బిఎస్పి, కాంగ్రెస్ ల టిక్కెట్లను తెలుగుదేశం పార్టీనే పిక్స్ చేస్తోందని ఆయన చెప్పారు. మొత్తం మీద హర్షకుమార్ తెలుగుదేశంలో పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయారు. అమలాపురం ఎమ్.పి టిక్కెట్ ఇస్తారని ఆశించి టిడిపిలోకి వెళ్లి దెబ్బతిన్నారనుకోవాలి. తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య పొత్తు ఉందన్న కామెంట్లు చేయడంతో ఏపీలో హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Top