తనపై వచ్చిన వార్తలకు గట్టిగా కౌంటర్ వేసిన వై.వి.సుబ్బారెడ్డి..!

By Xappie Desk, March 22, 2019 10:25 IST

తనపై వచ్చిన వార్తలకు గట్టిగా కౌంటర్ వేసిన వై.వి.సుబ్బారెడ్డి..!

తనపై వచ్చిన వార్తలకు గట్టిగా కౌంటర్ వేసిన వై.వి.సుబ్బారెడ్డి..!
 
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైసీపీ పార్టీ కీలక నాయకుడు వై వి సుబ్బారెడ్డి తాజాగా ఆయనకు జగన్ మధ్య విభేదాలు వచ్చాయని టికెట్ల కేటాయింపు విషయంలో ఇద్దరి మధ్య అవగాహన సరిగా లేకపోవడంతో వై వి సుబ్బారెడ్డి..పార్టీ మారుతున్నారని అధికారపార్టీకి చెందిన కొన్ని మీడియా చానళ్లు తెగ వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తాను ఒంగోలు ఎమ్.పి టిక్కెట్ ఆశించిన మాట నిజమే అయినా, పార్టీ వేరేవారికి నిర్ణయించిందని, అందువల్ల తాను అంగకరిస్తానని మాజీ ఎమ్.పి వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.
 
తెలుగుదేశం మీడియాలో ప్రత్యేకంగా దీనిపై వార్తలు వస్తుండడంతో ఆయన వివరణ ఇచ్చారు. తమ పార్టీ అద్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి అవడం అనివార్యమని ఆయన అన్నారు.తాను వ్యక్తిగత పనుల రీత్యా విదేశాలకు వెళ్లానని ఆయన అన్నారు. తనకు రాజ్యసభ ఇస్తానని చెప్పినా వద్దని చెప్పానని ఆయన అన్నారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలు అంటేనే ఆసక్తి అని ఆయన అన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని తన అభిమానులను కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. తాను ఇన్‌ఛార్జిగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.Top