చంద్రబాబు ప్రభుత్వం పై మండిపడ్డ సినీ నటుడు మోహన్ బాబు..!

Written By Xappie Desk | Updated: March 22, 2019 23:10 IST
చంద్రబాబు ప్రభుత్వం పై మండిపడ్డ సినీ నటుడు మోహన్ బాబు..!

చంద్రబాబు ప్రభుత్వం పై మండిపడ్డ సినీ నటుడు మోహన్ బాబు..!
 
తెలుగు సినిమా రంగంలో సీనియర్ నటుడు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద లలో ఒకరైన మంచు మోహన్ బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తన విద్యా సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం ఫీజు చెల్లించలేదని..ఎన్ని లేఖలు రాసినా గాని సరైన స్పందన రాలేదని..చంద్రబాబు పై సంచలన కామెంట్ చేశారు. అంతేకాకుండా అన్ని రోజులు చంద్రబాబుకే ఉండని రోజులు మారతాయని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అన్నగారు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకు సభ్యత్వం లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా మోహన్ బాబు చేశారు.
 
పిల్లల చదువు కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తూట్లు పొడుస్తున్నారని...చాలా సార్లు-డజన్ కొద్ది వినతులు ఇచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనకు చంద్రబాబు అంటే ఇష్టమని కానీ ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే అసహ్యం వేస్తుందని..ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు స్పందించాలని లేకుంటే న్యాయస్థానానికి వెళ్లి పోరాటానికైనా సిద్ధమని మోహన్ బాబు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మోహన్ బాబు తో పాటు ఆయన ఇద్దరు కుమారులు మరియు కుటుంబ సభ్యులు..విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Top