సిట్ పై మండిపడ్డ దివంగత వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత..!

Written By Xappie Desk | Updated: March 22, 2019 23:15 IST
సిట్ పై మండిపడ్డ దివంగత వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత..!

సిట్ పై మండిపడ్డ దివంగత వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత..!
 
వైయస్ వివేకానంద రెడ్డి హత్య రాయలసీమ రాజకీయాలలో మరియు ఏపీ పాలిటిక్స్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఈ హత్య గురించి అధికారపార్టీకి మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఈ హత్య గురించి విచారణ నిమిత్తం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర విచారణ సంస్థ సిట్ ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా వైయస్ వివేకానంద రెడ్డి కూతురు చంద్రబాబు ఆధీనంలో సిట్ పనిచేస్తుందని ఆ సంస్థపై తనకు నమ్మకం లేదని ఢిల్లీలో మీడియా సమావేశంలో పేర్కొనడంతో...ఇదే క్రమంలో ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థ అప్పగించాలని ఆమె కోరనున్న క్రమంలో ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా ఈ కేసును అడ్డంపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో పవర్ లో ఉన్న అధికార పార్టీ టిడిపి...తమకు సంబంధించిన వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరపడానికి..ఏర్పాట్లు చేస్తుందని వివేకానంద కుమార్తె సునీత చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.కేసును అడ్డంపెట్టుకుని చేతిలో అధికారం ఉంచుకొని తన తండ్రి హత్య కేసును రాజకీయంగా వాడుకోవడానికి ఏపీ అధికార పార్టీ చూస్తుందని..ఈ కేసు విషయంలో కేంద్ర విచారణ సంస్థ జోక్యం చేసుకోవాలని వైయస్ సునీత పేర్కొన్నారు. దీంతో సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Top