పులివెందుల లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన జగన్..!

Written By Xappie Desk | Updated: March 22, 2019 23:21 IST
పులివెందుల లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన జగన్..!

పులివెందుల లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన జగన్..!
 
వైసీపీ అధినేత జగన్ తాజాగా పులివెందుల లో నామినేషన్ వేసిన క్రమంలో పులివెందుల ప్రజలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంట 49 నిమిషాలకు సర్వమత ప్రార్ధనలు తరువాత నామినేషన్ వేశారు జగన్. నామినేషన్ కు ముందు జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం పులివెందుల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. రాజకీయాలలో ధైర్యం సహనం మాట మీద నిలబడటం ఇవన్నీ పులివెందల నేల నాకు నేర్పిందని కడప జిల్లాలో పుట్టినందుకు గర్వపడుతున్నాను అంటూ చాలా గర్వంగా ప్రసంగించారు జగన్.
 
ముఖ్యంగా మాట మీద నిలబడటం అధికారం కోసం అబద్దం ఆడకుండా మోసం చేయకుండా క్లియర్ పాలిటిక్స్ చేయటం పులివెందల నేల నాకు నేర్పింది అంటూ జగన్ చేసిన ప్రసంగానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మొత్తం హర్షధ్వానాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న ప్రభుత్వం చీకటి ప్రభుత్వమని...రాబోయే ఎన్నికలలో ఓడిపోతాడని తెలిసి గొడవలు పెట్టడానికి ఫ్యాక్షన్ తరహా విధంగా పాలిటిక్స్ చేస్తున్నారని..ఇదే క్రమంలో తన పార్ట్నర్ తో కలిసి చీకటి రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పార్ట్నర్ అంటే ఎవరో మీకు తెలుసు కదా అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆ సభలో ఉన్న ప్రజలను అడుగగా మొత్తం అంతా పవన్ కళ్యాణ్ అంటూ అనడం గమనార్హం.
 
రాబోయే రోజుల్లో అధికార పార్టీ ఎన్ని గొడవలు పెట్టిన సహనంతో ఉండాలని గొడవలు పెట్టి ఎన్నికలను వాయిదా వేయడానికి అలాగే నన్ను ఫ్యాక్షన్ లీడర్ గా ప్రజల దృష్టిలో మీడియాలో చూపించడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉండాలని..రాబోయే మన ప్రభుత్వం కాబట్టి..అందరికీ మంచి జరుగుతుందని. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని చీకటి వెళ్లిపోయాక వచ్చేది వెలుగు అని జగన్ పేర్కొన్నారు. ఎంతమంది ఎన్ని కుయుక్తులు పార్ట్నర్ తో కలిసి రాజకీయాలు చేసినా..ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతిదీ సామాన్యుడి గమనిస్తున్నారని...ప్రజా క్షేత్రంలో ఇటువంటి వారు ఎక్కువ కాలం ఉండాలని రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
Top