జగన్ పై పవన్ చేస్తున్న కామెంట్లను ఆసక్తిగా గమనిస్తున్న ఏపీ ప్రజానీకం..!

Written By Xappie Desk | Updated: March 24, 2019 10:34 IST
జగన్ పై పవన్ చేస్తున్న కామెంట్లను ఆసక్తిగా గమనిస్తున్న ఏపీ ప్రజానీకం..!

జగన్ పై పవన్ చేస్తున్న కామెంట్లను ఆసక్తిగా గమనిస్తున్న ఏపీ ప్రజానీకం..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం అలుముకుంది. ప్రధాన పార్టీల రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాబోతున్న ఎన్నికల కు వామపక్ష పార్టీలతో కలసి పోటీకి దిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ..ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ పై చేస్తున్న కామెంట్లు రాష్ట్ర ప్రజలు మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడు జగన్...అతను వస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది అంటున్న తరుణంలోనే..భీమవరంలో నామినేషన్ వేసిన సందర్భంగా పాల్గొన్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అందుకున్న రాగమే అందుకుని... పులివెందుల గుండాలు భీమవరం లో అడుగు పెడితే తాట తీస్తాం.. తన్ని తరిమేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల గురించి...కొన్ని స్థానాలలో నే జనసేన పార్టీ తమ అభ్యర్ధులను నిలబెట్టడం..టీడీపీ గెలిచే స్థానాలలో తన పార్టీ తరఫున డమ్మీ క్యాండెట్ నీ పోటీకి దింపడం ఇవన్నీ చూస్తుంటే చాలా మంది సామాన్య ప్రజలు టీడీపీ- జనసేన పార్టీలు ఒకటేనని బయటకు ఒకలాగా...ఉంటూ చీకటిలో ఇద్దరు కలిసే పనిచేస్తున్నారంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుని రక్షించడానికి మాత్రమే పనిచేస్తున్నట్లు ఉందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తనపై నమ్మకాన్ని మరియు అభిమానాన్ని పెట్టుకున్న ప్రజలను..రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి అమ్మకానికి పెట్టారని తన మాటలను నమ్మే ప్రజల దృష్టిలో జగన్ ని ఒక అరాచక శక్తిగా చిత్రీకరిస్తున్నారు అంటూ మరికొంతమంది పేర్కొంటున్నారు. అయితే 2014 ఎన్నికలకు మరియు 2019 ఎన్నికలకు మధ్య ప్రజలు అంతా తెలుసుకున్నారని రాబోతున్న ఎన్నికలల్లో తగిన తీర్పు చెబుతారని వైసిపి పార్టీ నేతలు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ కుమ్మక్కు రాజకీయాల గురించి కామెంట్లు చేస్తున్నారు.
Top