బాబుని సంతోష పెట్టడానికి పవన్ కళ్యాణ్ తెగ కష్టపడుతున్నాడు: విజయసాయిరెడ్డి .!

Advertisement

by Xappie Desk | March 25, 2019 10:35 IST
Follow Xappie
బాబుని సంతోష పెట్టడానికి పవన్ కళ్యాణ్ తెగ కష్టపడుతున్నాడు: విజయసాయిరెడ్డి .!

బాబు ని సంతోష పెట్టడానికి పవన్ కళ్యాణ్ తెగ కష్టపడుతున్నాడు: విజయసాయిరెడ్డి .!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మరియు టిడిపి అధినేత చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోతున్న ఎన్నికలలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ లు కలిసినా,మరో నలుగురు కలిసినా వార్ వన్ సైడేనని, ఫలితం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఏకపక్షమేనని ఆ పార్టీ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్యాకేజ్‌ స్టార్‌గా మారిన పవన్‌ కళ్యాణ్‌లో ఉన్మాదం కట్టలు తెంచుకుందని, యజమానికి సేవ చేయడంలో ఆయన టెన్షన్‌ పడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టయినా చంద్రబాబు కళ్లలో ఆనం‍దం చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలిసినా మరో నలుగురు కలిసి వచ్చినా ఫలితం ఏకపక్షమేనని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలంతా గమనిస్తున్నారని..రాబోతున్న ఎన్నికలలో పార్ట్నర్ రాజకీయాలకు ప్రజలు ఓటు తో చెక్ పెట్టబోతున్నట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.


Advertisement


Advertisement

Top