జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలలో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఆయన అసెంబ్లీకి గాజువాక నియోజకవర్గం నుండి మరియు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతం నుండి పోటీకి దిగుతున్న క్రమంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీకి దిగిన నేపథ్యంలో అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ రంగంలోనూ పవన్ కళ్యాణ్ ఏ విధమైన మెజార్టీ సాధిస్తారో అంటూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ...ఎపిలో ఏర్పడేది జనసేన ప్రభుత్వం అని చెప్పారు. కైకలూరు లో జరిగిన సభ లో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ అదికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని కూడా ఆయన అన్నారు. పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే ఊరుకోనని ఆయన వ్యాఖ్యానించారు. పాతకోటలు బద్దలు కొట్టి, కొత్త రాజకీయాలు తెస్తానని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానని ఆయన అన్నారు. చంద్రబాబు, జగన్ కుటుంబాలే రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు.