ఆంధ్ర రాజకీయాలలో ఆసక్తికరం గా మారిన మంగళగిరి నియోజకవర్గం..!
2019 ఎన్నికలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ విషయం పక్కన పెడితే మంగళగిరి నియోజకవర్గం పై రాష్ట్ర ప్రజలు మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం పెద్ద హాట్ టాపిక్ అయింది ఏపీ రాజకీయాలలో. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ గత ఎన్నికలలో ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టకుండా ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మంత్రి పదవి స్వీకరించారు. అయితే త్వరలో రాబోతున్న ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం రాష్ట్రంలో ఇప్పుడు చాలా చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో వైసీపీ పార్టీ కి చెందిన అసెంబ్లీకి పోటీ చేస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో వార్ వన్ సైడ్ అని సంచలన కామెంట్ చేశారు. అయితే అక్కడ జనసేన మద్దతుతో సిపిఐ అభ్యర్థి ముప్పాళ నాగేశ్వరరావు కూడా బరిలో ఉన్నారు.అయితే వీరందరిని దాటి తానే గెలవబోతున్నానని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబుని ఇక్కడ నుంచి తనపై పోటీ చేసేందుకు కోరానని కానీ ఆయన చెయ్యలేదని తాను పడిపోతానన్న భయంతోనే ఇప్పుడు నారా లోకేష్ ని బరిలో దింపారని ఇక లోకేష్ కూడా ఇక్కడ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.