నన్ను టచ్ చేయలేక మహేష్ బాబు పై ఐటీ దాడులు..!

Written By Xappie Desk | Updated: March 26, 2019 10:23 IST
నన్ను టచ్ చేయలేక మహేష్ బాబు పై ఐటీ దాడులు..!

నన్ను టచ్ చేయలేక మహేష్ బాబు పై ఐటీ దాడులు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్రానికి సంబంధించిన విచారణ సంస్థలు గాని దాడులు గానే రాష్ట్రంలో ఎక్కడ ఎవరి పైనా ఎప్పుడైనా ఎలాగైనా జరిగిన దానిని ఆంధ్ర ప్రజల ముందు సానుభూతి సంపాదించుకోవడానికి చిత్రీకరించే విధంగా వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. గుంటూరు టిడిపి ఎమ్.పి గల్లా జయదేవ్ తనను ఏమీ చేయలేక తన బావమరిది, ప్రముఖ నటుడు మహేష్ బాబుపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసిందని ఆరోపించారు.
 
తాను లోక్ సభలో గట్టిగా మాట్లాడిన తర్వాత ఈడి నోటీసులు వచ్చాయని అన్నారు. తాను పన్నులు సరిగా కట్టడం వల్ల ఆదాయపన్ను శాఖ తనను ఏమీ చేయలేకపోయిందని అన్నారు. తననేమీ చేయలేక తన బావ హీరో మహేశ్‌బాబుపై ఐటీ దాడులు చేసినట్టు గల్లా ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం పన్ను చెల్లింపుదారునని ఆయన అన్నారు. గుంటూరుకు తాను పలు అబివృద్ది కార్యక్రమాలు చేపట్టానని ఆయన వివరించారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు గెలుస్తుందని పేర్కొన్నారు.
Top