రోజురోజుకి పెరిగిపోతున్న కెఎ పాల్ కామెడీ..!

Written By Xappie Desk | Updated: March 26, 2019 10:30 IST
రోజురోజుకి పెరిగిపోతున్న కెఎ పాల్ కామెడీ..!

రోజురోజుకి పెరిగిపోతున్న కెఎ పాల్ కామెడీ..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంటే మరోపక్క ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ చేస్తున్నా వ్యాఖ్యలు కామెడీని తలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికాగా మారుస్తాను..జగన్ చంద్ర బాబు పవన్ కళ్యాణ్ లకు రాజకీయ పాఠాలు నేర్పిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి అయి చేస్తాను అని గంభీర వ్యాఖ్యలు చేసి గత కొంతకాలంగా ప్రజాశాంతి పేరుతో కమెడియన్ గా వ్యవహరిస్తున్న ఆ పార్టీ అద్యక్షుడు కె.ఎ.పాల్ సకాలంలో నామినేషన్ వేయలేదు.
 
భీమవరంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై పోటీచేస్తానంటూ ప్రచారం చేసిన పాల్ టైమ్ ముగిసిన తర్వాత నామినేషన్ ఇవ్వడానికి రాగా అధికారులు అనుమతించలేదు.అయితే కావాలని అదికారులు అంగీకరించలేదని, అన్నారు. అంతేకాక పనిలో పని గా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని కూడా ఆయన చెప్పేశారు. తాను భీమవరంలో పోటీ చేస్తున్నాననంటే పవన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. యధా ప్రకారం పిచ్చి హామీలను ఆయన చెప్పుకుంటూ పోయారు. అయితే కావాలనే ఈయన ఆలస్యంగా వచ్చారా అన్న డౌట్ కూడా ఉంది.
Top