సంచలన హామీ ప్రకటించిన రాహుల్ గాంధీ..!

Written By Xappie Desk | Updated: March 26, 2019 10:36 IST
సంచలన హామీ ప్రకటించిన రాహుల్ గాంధీ..!

సంచలన హామీ ప్రకటించిన రాహుల్ గాంధీ..!
 
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో రాబోతున్న లోక్సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశమంతటా చేయబోయే పనులను గురించి మరియు దేశంలో ఉన్న నిరుపేదలు గురించి సంచలనం హామీలు ప్రకటించారు. దేశమంతటా త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అత్యంత పేదలుగా ఉన్నవారికి ఏడాదికి 72 వేల రూపాయల చొప్పున,అంటే నెలకు ఆరువేల రూపాయల ఆర్దిక సాయం చేస్తామని ఆయన చెప్పారు.
 
కనీస ఆదాయ హామీ పధకం కింద దేశంలోని 20 శాతం అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000ను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఈ పధకంతో నేరుగా ఐదు కోట్ల కుటుంబాలు 25 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారని చెప్పారు. నెలకు రూ 12,000లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పధకం వర్తింపచేస్తామని చెప్పారు. దీంతో ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీ నిరుపేదలకు ఇచ్చిన హామీలు దేశమంతటా చర్చనీయాంశం అయ్యాయి.
Top