చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై సంచలన కామెంట్స్ చేసిన షర్మిల..!
వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చెల్లెలు షర్మిల తాజాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో మీడియా సమావేశంలో చంద్రబాబుపై మరియు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ ఏది చెబితే యాక్టర్ అది చేస్తుంటారు. యాక్టర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం...ఏపీ పాలిటిక్స్ లో చంద్రబాబు డైరెక్షన్లో..బాగా యాక్టింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసిన చంద్రబాబు కి వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్... ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు అంటూ..డేటా చోరీ కేసులో రాష్ట్ర సామాన్య ప్రజల సమాచారాన్ని మొత్తం ప్రవేటు సంస్థలకు అప్పజెప్పిన చంద్రబాబున్ని ఇంతవరకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదని.. ఎందుకంటే తన డైరెక్టర్ చంద్రబాబును ప్రశ్నిస్తే..అనేక సమస్యలు వస్తాయని..ఆ విషయాన్ని పక్కనబెట్టి పాలిటిక్స్లో బాగా నటిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు...జనసేన పార్టీకి ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లేనని అన్నారు షర్మిల. మరియు అదే విధంగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును నాశనం చేసిన చంద్రబాబు...రాబోతున్న ఎన్నికల కు నన్ను గెలిపించడం మీ బాధ్యత అంటూ..ప్రజలను ఓట్లు అడగటం సిగ్గుచేటు అని అన్నారు.