ఆ సినిమా విడుదల చేయవద్దు అంటున్న కాంగ్రెస్ పార్టీ..!

Written By Xappie Desk | Updated: March 26, 2019 11:24 IST
ఆ సినిమా విడుదల చేయవద్దు అంటున్న కాంగ్రెస్ పార్టీ..!

ఆ సినిమా విడుదల చేయవద్దు అంటున్న కాంగ్రెస్ పార్టీ..!
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా రంగాలలో బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. మరోపక్క దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మోడీ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించి రాబోతున్న ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లను ప్రభావితం చేయడానికి తాజాగా ఇటీవల పీఎం నరేంద్ర మోడీ అంటూ సినిమా తీయడం జరిగింది.
 
ఈ సినిమాలో ప్రధాన పాత్ర దారుడిగా వివేక్ ఒబెరాయ్ నటించాడు. దీంతో తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాపై స్పందించింది. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సినిమాని విడుదల చేయకూడదు అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 11 న జరగగా, తుది విడత పోలింగ్ మే 19న జరుగుతుంది. అయితే ఎన్నికల సమయంలో సినిమా విడుదలవుతే ఓటర్లను బాగా ప్రభావితం చేసినట్లవుతుంది, అంతేకాకుండా ఇది ఎన్నికల నియమాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబల్ తెలిపారు. అంతేకాకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కొద్దిరోజుల క్రితం మోడీపై సినిమా ప్రారంభించడం, ఎన్నికల సమయంలోనే సినిమాని విడుదల చేయాలనుకోవడం మోడీ ఎత్తులని అర్థమవుతున్నాయని కపిల్ సిబాల్ తెలిపారు.
Top