వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో హైకోర్టు సంచలన ఆదేశాలు…!

Written By Xappie Desk | Updated: March 27, 2019 09:54 IST
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో హైకోర్టు సంచలన ఆదేశాలు…!

వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో హైకోర్టు సంచలన ఆదేశాలు…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని ఇటీవల కొంతమంది హత్య చేయించిన విషయం మనకందరికీ తెలిసినదే. ఎన్నికల ముందు వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ హత్య విషయమై ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ మరియు ప్రతిపక్ష పార్టీ వైసిపి పార్టీలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేయడానికి అధికార పార్టీ టిడిపి ప్రయత్నిస్తుందని ఇటీవల వైయస్ వివేకా కూతురు సునీత పేర్కొనడం జరిగింది.
 
ఇదే విషయమై వైఎస్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో..ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ఎటువంటి మీడియా స‌మావేశాలు నిర్వ‌హించొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, వివేకా హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను మీడియాకు తెలిపే క్ర‌మంలో వారు వైఎస్ ఫ్యామిలీ ప‌రువుకు భంగం క‌లిగేలా సిట్ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైఎస్ జ‌గ‌న్‌, సౌభాగ్య‌మ్మ‌లు హైకోర్టుకు స‌మ‌ర్పించిన పిటిష‌న్‌లో పేర్కొన్నారు. జ‌గ‌న్‌, సౌభాగ్య‌మ్మ‌ల పిటిష‌న్‌లను ప‌రిగ‌ణ‌లోకి తీపుకుని విచారించిన హైకోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 28కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.
Top