పవన్ ముఖ్యమంత్రి అవ్వగానే మరుక్షణం ఆ మూడు సంతకాలు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాలం టిడిపి వైసిపి పార్టీలకు దీటుగా తాను స్థాపించిన జనసేన పార్టీని సామాన్య ప్రజల లోకి తీసుకు వెళ్లారు. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీకి కంటే..ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీని ప్రశ్నిస్తూ ప్రజలలో అద్భుతమైన స్పందన దక్కించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిసి పోయాయి అని కామెంట్ లు వచ్చినా కానీ..పవన్ కళ్యాణ్ మాత్రం ఉన్నది ఉన్నట్టుగా తన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆంధ్ర రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మూడు హామీలకు మొదటి మూడు సంతకాలు చేయనున్నానని తెలియజేసారు. ఆ మూడు హామీలలో మొదటి సంతకం “ఎకరానికి రైతుకి 8వేలు సాయం మరియు 5వేలు పెన్షన్” అలాగే రెండవ హామీ “మహిళలకు 2500 నుంచి 3500 నగదు బదిలీ పథకం” పైన ఇక మూడవది ఇప్పటి వరకు “ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటినీ భర్తీ చేసి తీరుతాం” అని వెల్లడించారు. పవన్ ఇప్పటికే తన హామీలన్నింటినీ జనసేన మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.మరి పవన్ ఒకవేళ అధికారంలోకి వచ్చినట్టయితే ఈ హామీలను ఎంత వరకు అమలు చేస్తారో చూడాలి.