జగన్ అధికారంలోకి వస్తే పేదలకు ఉన్నత చదువులు దగ్గర అవుతాయి: మోహన్ బాబు..!

Written By Xappie Desk | Updated: March 27, 2019 10:01 IST
జగన్ అధికారంలోకి వస్తే పేదలకు ఉన్నత చదువులు దగ్గర అవుతాయి: మోహన్ బాబు..!

జగన్ అధికారంలోకి వస్తే పేదలకు ఉన్నత చదువులు దగ్గర అవుతాయి: మోహన్ బాబు..!
 
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు అధినేత అయినా మంచు మోహన్ బాబు...తాజాగా హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్ లో జగన్ సమక్షాన వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దేవుడు మరియు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీ రామారావు మరణించిన తర్వాత రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు ని..చంద్రబాబు మాటలు విని బాధ పెట్టినందుకు గత 20 సంవత్సరాల నుండి పశ్చాత్తాపం పడుతున్నట్లు ఈ సమావేశంలో పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన విద్యా సంస్థలకు రావలసిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని...ఎన్నిసార్లు చంద్రబాబు తో ఫోన్ లో మాట్లాడిన లెటర్లు రాసిన స్పందన రాలేదని పేర్కొన్నారు. ఎల్లకాలం ఒకవైపే టైం ఉండదని టైం మారడం ఖాయమని అన్నారు. రాబోతున్న ఎన్నికలలో జగన్ అధికారంలోకి వస్తే పేదలకు ఉన్నత విద్యలో చాలా దగ్గర అవుతాయని ...తన విద్యా సంస్థలలో కూడా పేద వారికి ఎన్నో రాయితీలు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు మోహన్ బాబు. మొత్తంమీద మోహన్ బాబు వైసీపీ పార్టీలో చేరడంతో ఆంధ్ర రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి.
Top