రైతులకు సంచలన హామీ ఇచ్చిన జగన్, ఫుల్ జోష్ లో ఉన్న ఏపీ రైతాంగం..!

Written By Xappie Desk | Updated: March 28, 2019 12:42 IST
రైతులకు సంచలన హామీ ఇచ్చిన జగన్, ఫుల్ జోష్ లో ఉన్న ఏపీ రైతాంగం..!

రైతులకు సంచలన హామీ ఇచ్చిన జగన్, ఫుల్ జోష్ లో ఉన్న ఏపీ రైతాంగం..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రచారం రోజురోజుకి దూసుకుపోతుంది. ప్రజల మధ్య ఉంటూ ప్రజలతోనే అన్నట్టుగా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన నాటినుండి జగన్ ప్రజల మధ్యలో ఉంటూ అధికార పార్టీ రాష్ట్రంలో చేస్తున్న ప్రతి అవినీతిని అసెంబ్లీలో తనకు అవకాశం ఇవ్వక పోయినా కానీ ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవినీతి చేసింది వంటి విషయాలను తెలియజేస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో చంద్రబాబు తీరును ప్రజల మధ్య ఎండగడుతూ ప్రతిపక్ష నేతగా జగన్ మంచి సక్సెస్ అయ్యారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.
 
ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇటీవల వైఎస్ జగన్ ఇచ్చిన హామీ పట్ల ఎంతగానో సంతోష పడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోతున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న రైతులకు పదివేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు, అంతే కాకుండా రైతులకు మే మాసం లోనే 12,500 రూపాయలు ప్రతి ఎకరాకు ఇవ్వబోతున్నట్లు జగన్ హామీ ఇవ్వడంతో రాబోతున్న ఎన్నికలలో జగన్ కి ఓటు వేయడానికి రాష్ట్రంలో ఉన్న రైతులు ఎంతగానో సంతోషిస్తున్నట్లు రాష్ట్రంలో జరుగుతున్న పలు సర్వేల లో..తేలింది. మొత్తం మీద రైతులకు వైయస్ జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ పట్ల ఏపీ రైతులు మరియు ప్రజలు వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు జగన్ వస్తే బాగుంటుంది అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Top