జర్నలిస్టుల పై విరుచుకుపడ్డ బాలకృష్ణ..!

Written By Xappie Desk | Updated: March 28, 2019 12:47 IST
జర్నలిస్టుల పై విరుచుకుపడ్డ బాలకృష్ణ..!

జర్నలిస్టుల పై విరుచుకుపడ్డ బాలకృష్ణ..!
 
గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికైన బాలకృష్ణ ..రాబోతున్న ఎన్నికలలో కూడా అదే నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్న క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న బాలకృష్ణ మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. అంతేకాకుండా రాస్కెల్ అంటూ జర్నలిస్టులపై దుర్భాషలాడుతూ ఓ మీడియా ప్రతినిధి ఛానల్ కు చెందిన విలేకరిపై ప్రాణాలు తీస్తా బాంబులు వేసి అంటూ కత్తుల తిప్పడం తెలుసు నరికి పోగులు పెడతా..అనే జర్నలిస్టులపై హిందూపురం నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ చెయ్యి చేసుకున్నారట.
 
గతంలో అనేక సార్లు అభిమానులపై చేయి చేసుకున్న బాలకృష్ణ.. తాజాగా ఎన్నికల ముందు కూడా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా వ్యవహరించకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడంతో బాలకృష్ణ తీరుపై నెటిజెన్లు మరియు పలువురు సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. 2019 ఎన్నికలకు హిందూపురం నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా పోటీ చేయడానికి బరిలోకి దిగిన బాలకృష్ణ ఈ విధంగా జర్నలిస్టులపై చేయి చేసుకోవడంతో ఈ విషయం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది..ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు బాలకృష్ణ వ్యవహరించిన తీరుకు నియోజకవర్గంలో తలెత్తి కోలేక పోతున్నట్లు సమాచారం.
Top