త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్ తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం లో పాల్గొన్నారు. జననేత జగన్ వచ్చిన సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలి రావడంతో రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అవటంతో ఇరువైపుల ప్రజలు మొత్తం ఉండటంతో చాలామంది భవనాలపై భారీ సంఖ్యలో నిలబడటంతో..రోడ్డుపక్కన ఉన్న భవనం పిట్టగోడ కూలింది. ఈ ప్రమాదంలో భవనంపై నున్న 20 మంది గాయపడ్డారు.
అదే సమయంలో భవనం కింద నిలబడిన మరో 10 మందికి కూడా దెబ్బలు తగిలాయి. గాయాలయిన వారిని మండపేట ఆస్పత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అవసరం అయితే మెరుగైన వైద్య చికిత్స చేయిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. గాయపడ్డ వారిని జగన్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు సూచించారు.