మళ్లీ అదే స్లోగన్ ఎత్తుకున్న చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 28, 2019 13:00 IST
మళ్లీ అదే స్లోగన్ ఎత్తుకున్న చంద్రబాబు..!

మళ్లీ అదే స్లోగన్ ఎత్తుకున్న చంద్రబాబు..!
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకు జాబు రావాలి అంటే బాబు రావాలని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మరియు నాయకులు తెగ ఊదరగొట్టారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన పెద్దగా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్ష పార్టీలు కామెంట్ చేస్తూ రాబోతున్న ఎన్నికలలో జాబ్ రావాలంటే బాబు పోవాలని పిలుపునిచ్చారు.
 
అయితే ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో మడకసిరా లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో జాబులు రావాలంటే మరొకసారి బాబు రావాలని స్లోగన్ మళ్లీ ఎత్తుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు మాట్లాడుతూ తన పాలనలో రూ.15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 30 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అన్నారు.వచ్చే ఐదేళ్లలో మడకశిరలో ఊహించని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలందరి ఆశీస్సులు తనకు కావాలని, ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించి మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చేలా దీవించాలని కోరారు. అదే, జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా? అని ప్రశ్నించారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా బీజేపీకి వేసినట్టేనని ప్రజలకు సూచించారు. రాబోయే ఎన్నికలలో టిడిపిని గెలిపిస్తేనే మళ్ళీ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు చంద్రబాబు.
Top