జాతీయ రిపోర్టర్ కి జగనే సీఎం అని అర్థమైపోయిందా..?

Written By Xappie Desk | Updated: March 30, 2019 10:27 IST
జాతీయ రిపోర్టర్ కి జగనే సీఎం అని అర్థమైపోయిందా..?

జాతీయ రిపోర్టర్ కి జగనే సీఎం అని అర్థమైపోయిందా...?
 
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చాలా చురుకుగా ముందుకు కదులుతూ పార్టీ క్యాడర్ ని మరియు నాయకులను సిద్ధం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో జగన్ మీటింగ్ లకు వస్తున్న జనం చూస్తుంటే అందరికీ మతి పోతుంది. ఇసుక వేస్తే రాలనంత జనం జగన్ సభలకు రావడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు భయపడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం చూస్తుంటే జనం ఇప్పటికే జగన్ సీఎం అయిపోయారు అని డిసైడ్ అయిపోయారు అని కేవలం ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయని అందరు అనుకుంటున్నారు.
 
ఇటువంటి తరుణంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ మీ ఇంటర్వ్యూ చేయడానికి జాతీయ ఛానల్ ఎన్డి టీవీ రిపోర్టర్ జనం నుండి జగన్ కి వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోయాడు. ఇటువంటి తరుణంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను మరియు కేంద్రంలో జగన్ అధికారంలోకి వస్తే ఎటువంటి రాజకీయ అడుగులు వేస్తారు వంటి ప్రశ్నలను జగన్ ని అడిగి తెలుసుకున్నారు. అయితే ఒక పక్క నుండి జనం మాత్రం జగన్ ని.... సీఎం సీఎం అని అంటుంటే..ప్రస్తుతం నేను చేస్తున్న ఇంటర్వ్యూ నెక్స్ట్ సీఎం ఏపీ సీఎం అని అంటారా అని జగన్ ని కొంటెగా ప్రశ్నించారు. మొత్తంమీద చూసుకుంటే ఎన్డి టీవీ రిపోర్టర్ కి జగన్ సీఎం అయిపోయినట్లుగా ఆయన వ్యవహరించిన తీరును బట్టి అర్థమవుతుంది. మరోపక్క జగన్ ఇది అంతా దేవుడి దయ ప్రజల ఆశీస్సులు మరియు మా నాన్నగారి దీవెనలు అని రిపోర్టర్ కి సమాధానం ఇచ్చారు.
Top