బ్రేకింగ్ న్యూస్: ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థిపై ప్రజాగ్రహం..పరిగెత్తిన అభ్యర్ధి..?

Written By Xappie Desk | Updated: March 30, 2019 10:33 IST
బ్రేకింగ్ న్యూస్: ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థిపై ప్రజాగ్రహం..పరిగెత్తిన అభ్యర్ధి..?

బ్రేకింగ్ న్యూస్: ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థిపై ప్రజాగ్రహం... పరిగెత్తిన అభ్యర్ధి..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ...ప్రస్తుత ఎన్నికలను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతోంది అని పలు సర్వేల లో వస్తున్న ఫలితాలు మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజా వ్యతిరేకత బట్టి తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు వాటిని అమలు పరచడంలో విఫలమవడంతో ఎన్నికలకు ప్రజల మధ్యకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏపి ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో టీడీపీ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని పాండురంగ వీధిలో పర్యటించారు. స్థానిక సమస్యలపైన మహిళలు ఆయన్ను గట్టిగా నిలదీశారు. ‘ఇంటి పట్టాలకోసం ఐదేళ్లలో పది సార్లు అర్జీలు ఇచ్చినాం.. ఇళ్లు లేని వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా.. నీ వెనుక తిరిగే వాళ్లకు పట్టాలు ఇచ్చినావ్’ అంటూ ఆయన్ను నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండా సూరి దాటేసుకుని వెళ్లిపోయారు. స్థానిక నాయకులు ‘మేమున్నాంలేమ్మా... మళ్లీ అధికారంలోకొస్తే ఇప్పిస్తాం ’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే.. చూసినాం పోప్పా..’ అంటూ వారిని అక్కడి నుంచి తరిమేసినంత పనిచేశారు. ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Top