రాక్ స్టార్ అంటూ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన పీకే..!

Written By Xappie Desk | Updated: April 01, 2019 10:14 IST
రాక్ స్టార్ అంటూ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన పీకే..!

రాక్ స్టార్ అంటూ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన పీకే..!
 
కర్నూలు లో జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోయాక వెంటనే ఆ పార్టీ అధినేత జగన్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించి తన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంతి కిషోర్ ను తెరపైకి తీసుకువచ్చి పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారు. ముఖ్యంగా పాదయాత్రతో జగన్ ఉప ఎన్నికలలో వచ్చిన అపజయాన్ని పట్టుకుని పార్టీ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో సంచలన నిర్ణయం తీసుకుని ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే విధంగా వైసీపీ పార్టీ గ్రాఫ్ అమాంతం పైకి లేపారు. దీంతో పాదయాత్ర ఎఫెక్ట్ తో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ 2019 ఎన్నికలలో అధికారంలోకి రావడం ఖాయమని అలాగే జగనే ముఖ్యమంత్రి అని ఫలితాలు వస్తున్నాయి. ఇదిలావుండగా తాజాగా ‘రావలి జగన్‌, కావలి జగన్’ పాట యూట్యూబ్‌లో సంచలనాలను సృష్టిస్తోందని జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యానించారు.ఆయన ఈ మేరకు ట్విటర్ లో కామెంట్ చెశారు. రాజకీయ ప్రచార పాటను కోటిమందికి పైగా వీక్షించడం యూట్యూబ్‌లో సరికొత్త రికార్డని తెలిపారు. ‘సోదరుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించేలోపే రాక్‌స్టార్‌ని చేశారు. సీబీఎన్‌జీ (చంద్రబాబు నాయుడు గారు) మీ నుంచి మరిన్ని విమర్శలు రాకముందే కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని ప్రశాంత్‌ కిషోర్‌ చమత్కరించారు.
Top