నా కొడుకు కి పెద్ద భయమేమీ లేదు అంటున్న విజయమ్మ..!

Written By Xappie Desk | Updated: April 01, 2019 10:20 IST
నా కొడుకు కి పెద్ద భయమేమీ లేదు అంటున్న విజయమ్మ..!

నా కొడుకు కి పెద్ద భయమేమీ లేదు అంటున్న విజయమ్మ..!
 
వైసీపీ పార్టీ తరఫున తాజాగా ఇటీవల రంగంలోకి దిగిన ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లి పోతున్నారు. ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి విజయమ్మ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల నుంచి వైఎస్‌ జగన్‌కు మీరంతా అండగా ఉన్నారని.. వైఎస్‌ కుటుంబం ఎప్పటికీ ప్రజలకు రుణపడి ఉంటుందని అన్నారు. వైఎస్‌ మరణం తరువాత జగన్‌.. ఓదార్పు చేస్తానని మాటిచ్చారని.. ఇచ్చిన మాటకోసం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాతే.. కక్షగట్టి కేసులు పెట్టారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. నా కొడుకు అప్పుడే భయపడలేదు.. ఇప్పుడేం భయపడతాడని అన్నారు. వైఎస్‌ జగన్‌ది ఎవరి కాళ్ల మీదా పడే వ్యక్తిత్వం కాదన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసుండి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో బాబు చేతులు కలిపారన్నారు. కేసీఆర్‌కు, ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం కడుపు మాడ్చుకుని జగన్‌ ఎన్నో దీక్షలు చేశారన్నారు. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారన్నారు. జగన్‌ పోరాటాలతో ప్రత్యేక అంశం సజీవంగా ఉందన్నారు.
Top