జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఇటీవల ఎన్నికల ముందు పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిందే. రాబోతున్న ఎన్నికలలో నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాగబాబు వైసీపీ పార్టీ అధినేత జగన్ పై సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా పార్టీ సమావేశంలో ఒకానొక సమయంలో జగన్ మాట్లాడిన వీడియో క్లిప్ ని బయటకు తీసుకువచ్చి నాగబాబు లాజికల్ సెటైర్లు వేశారు. ఆ వీడియో లో జగన్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడుతూ..ప్రస్తుతం మీరు ఎంత అయితే పోగొట్టుకుంటున్నారో రాబోయే రోజుల్లో దానికి మించి లబ్ధి పొందుతురని జగన్ ప్రస్తుతం ఎన్నికలకు కూడా నియోజకవర్గానికి నిలబెట్టే క్యాండెట్ కి సంబంధించి మినిమం 30 కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థికి సీట్లు కేటాయించారని నాగబాబు మాట్లాడుతూ..అంటే ఈ 30 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి రేపు గెలిస్తే దానికి నాలుగింతలు 120 కోట్లు సంపాదించేలా చేస్తానని జగన్ చెప్తున్నారు అన్నయ్య నాగబాబు సెటైర్లు వేశారు. అంతే కాకుండా జగన్ అదే వీడియోలో తాను గెలిచిన తర్వాత అప్పుడు మన బిర్యానీ మన ప్లేట్ లోనే పెట్టుకొని తినొచ్చు అని అంటున్నారని అంటే ఆంధ్రప్రదేశ్ ను బిర్యానిలా తినేయడానికి జగన్ రెడీగా ఉన్నారని నాగబాబు వ్యాఖ్యానించారు.