చంద్రబాబు కొడుకు నారా లోకేష్ పై అదిరిపోయే సెటైర్లు వేసిన కొడాలి నాని..!
ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల రాజకీయాలు ఒకల వుంటే కృష్ణా జిల్లా రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని విజయవాడ ప్రాంతానికి చెందిన దేవినేని అవినాష్ ని పోటీకి దింపారు చంద్రబాబు. ఎలాగైనా వైసీపీ పార్టీ అభ్యర్థి కొడాలి నాని కి చెక్ పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలో అనేక వ్యూహాలు ప్రతివ్యూహాలతో కొడాలి నానికి దిమ్మతిరిగిపోయే విధంగా రాజకీయం చేయాలని చేస్తున్న సమయంలో తాజాగా కొడాలి నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ...దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చనిపోతే ఆయన పేరుమీద వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ పెట్టారని, చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసినా రాష్ట్రం మొత్తం మీద వైసీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల మెజార్టీనే కోల్పోయిందన్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు, వర్ధంతికి, జయంతికి తేడా తెలీదని, రెండు లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తానని లోకేష్ చెప్పడం ఆయన మేధావి తనానికి అద్దం పడుతుందని కొడాలినాని ఎద్దేవ చేశారు. ప్రజలు నీళ్లు ఇస్తామని, ఇవ్వమని చెప్పడానికి తేడా తెలియని వ్యక్తి లోకేష్ అన్నారు. అంతటి అసమర్ధుడ్ని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు విజ్ఞతకే చెల్లిందన్నారు. ఏదిఏమైనా రాబోయే ఎన్నికలలో మళ్ళీ గుడివాడ నియోజకవర్గంలో ఎగిరేది వైసీపీ పార్టీ జెండా అని తేల్చి చెప్పేశారు కొడాలి నాని.