భీమవరం ఎలక్షన్ ప్రచారంలో పవన్ ప్రస్తావన తీసుకురాకుండా జగన్..!
వైసీపీ పార్టీ అధినేత జగన్ రాబోతున్న 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి అని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రత్యర్థుల పై పోరాడుతున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయిన నాటినుండి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు పక్కా ప్రణాళికతో అధికార పార్టీ టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసిపి పార్టీ విజయం ఖాయమని జగనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని ప్రజలంతా ఫిక్స్ అయిపోయారని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావన తేకుండా ప్రసంగించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఒక సందర్భంలో మాత్రం ఆయన లోకల్ హీరోకి, సినిమా హీరోకి పోటీ అని వ్యాఖ్యానించారు. తుందుర్రులో ఆక్వాఫ్యాక్టరీ వల్ల ప్రజలు కాలుష్య బారిన పడుతున్నారు. ప్రజలు ఆందోళన చేస్తున్నా.. బాబు పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసమే. ప్రజలు కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నా సినీ యాక్టర్ ఏనాడు వారి దగ్గరకు వెళ్లలేదు. ఇక్కడే ఉండే మన లోకల్‌హీరో శీనన్నకు సినిమా హీరోకు మధ్యనే పోటీ. దేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు. రెండెకరాల చంద్రబాబు.. దేశంలోనే అత్యంత ధనిక సీఎం అంటే రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు.