పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన పవన్ కల్యాణ్..!

పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన పవన్ కల్యాణ్..!

పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన పవన్ కల్యాణ్..!
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు కోసం, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అంటూ జనసేన పార్టీ స్థాపించిన నాడు ప్రజలకు తెలియజేయడం జరిగింది. మార్పు కోసం మరియు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా రాజకీయాలు చేస్తూ 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటానికి ప్రధాన కారణమయ్యారు. అయితే ఈసారి రాబోతున్న ఎన్నికల కు మాత్రం వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ అధికార పార్టీ టీడీపీకి మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చుక్కలు చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో జనసేన కార్యకర్తలకు మరియు రాజకీయ నాయకులకు మరిచిపోయే విధంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ తరఫున నిలబడుతున్న అభ్యర్థుల విషయంలో ఎన్నికలను అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీలను ముందుగానే స్టాంపు పేపర్ల పై లికిత పూర్వకంగా అందజేయడం ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో మిగతా పార్టీలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా క్లియర్ పాలిటిక్స్ చేద్దామని పాలిటిక్స్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు మరియు పొలిటికల్ విశ్లేషకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి కొత్త ప్రయోగాలను రాజకీయాలలో ప్రజలు రాబోతున్న ఎన్నికలలో ఆదరిస్తారో లేదో చూడాలి.Top