సీబీఐ కేసులున్న నీకు ఓట్లు ఎలా వేసేద? వైకపా ప్రముఖ లీడర్ ని రోడ్డు మీదే నిలదీస్తున్న ప్రజలు - వైరల్ వీడియో

Written By Aravind Peesapati | Updated: April 02, 2019 14:13 IST
సీబీఐ కేసులున్న నీకు ఓట్లు ఎలా వేసేద? వైకపా ప్రముఖ లీడర్ ని  రోడ్డు మీదే నిలదీస్తున్న ప్రజలు - వైరల్ వీడియో

సీబీఐ కేసులున్న నీకు ఓట్లు ఎలా వేసేది ? వైకపా ప్రముఖ లీడర్ ని రోడ్డు మీదే నిలదీస్తున్న ప్రజలు - వైరల్ వీడియో
 
రాజకీయ రణరంగం రసవత్తరంగా నడుస్తోంది. దేశ వ్యాప్తంగా ఎలా ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఇబ్బందికర వాతావరణం ఎక్కువ ఐపోయింది. వైకాపా - టీడీపీ నువ్వా నేనా అన్నట్టు ముందుకు సాగుతున్నాయి. తక్కువ సమయం మాత్రమే పోలింగ్ కి ఉండడం, పొలిటికల్ గా ప్రచారం చేసుకోవడానికి కానీ ఇతరత్రా వ్యవహారాలకి కానీ సమయం లేకపోవడంతో ప్రత్యర్ధి మీద దొరికిన ఏ అంశాన్నీ ఒదులుకోవడం లేదు రెండు పార్టీల వాళ్ళూ ఈ క్రమం లోనే ఒక ప్రముఖ వైకాపా అభ్యర్ధి కి ఎక్కడికక్కడ చుక్కలు కనపడుతున్నాయి. ప్రచారం నుంచి అనేక అంశాలలో అతను తలనొప్పులు ఎదురుకోవడం కామన్ గా మారింది. వైకాపా మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుత వైకాపా అభ్యర్ధి మళ్ళ విజయ ప్రసాద్ ని కరక్ట్ గా ఎన్నికల టైం లో సీబీఐ కేసులు ఇరకాటం లో పడేశాయి. ఈ ఎన్నికల లో ఘన విజయం సాధించి తాను నిలబడిన విశాక వెస్ట్ ప్రాంతాన్ని జగన్ మోహన్ రెడ్డి కి బహుమతిగా ఇద్దాము అని అనుకున్న విజయ ప్రసాద్ కి చుక్క ఎదురు అవుతోంది. ప్రత్యర్ధులు ఆయన మీద ఒకప్పుడు ఉన్న సీబీఐ కేసులని ఎత్తి చూపి తమ ప్రచారాన్ని తేలిక చేసుకుంటూ ఉన్నారు. " విజయ్ ప్రసాద్ గనక తాను పర్ఫెక్ట్ అనీ, నిర్దోషిని అనీ నిరూపించుకో గలిగితే అంటే సీబీఐ ద్వారా ఒక క్లీన్ చిట్ తెచ్చుకోగలిగితే మేము ఆయనకి సపోర్ట్ చేస్తాము. లేదంటే ఆయన అసలు అభ్యర్ధిగా నిలబడే అర్హత కూడా లేదు అనేది మా వాదన " అంటూ లోకల్ ఓటర్లు తేల్చి చెబుతున్నారు. అసలు ఆయన మీద సీబీఐ కేసులు ఎలా పడ్డాయి ఎప్పుడు పడ్డాయి అనేది ఆసక్తికర అంశం. దేశ వ్యాప్తంగా త‌న వెల్ఫేర్ గ్రూప్ నకు చెందిన 82 సంస్థలపై సీబీఐ సోదాలు అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కోల్ కతా, బీహార్, ఒడిషా, ఝార్ఖండ్ లలో ప్రత్యెక సోదాలు జరిగాయి. చిట్ ఫండ్ పేరుతో డిపాజిట్లు సేకరించి అందులో వచ్చిన డబ్బుని , నిదులనీ వేరే వైపు పంపింకాహరు అనేది ఇక్కడ అన్ని కంపెనీల మీదా ప్రధాన ఆరోపణ. జార్ఖండ్ కోర్టు ఆదేశాలతో రెండు కేసులు నమోదు చేసిన సీబీఐ, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఏక కాలంలో దాడులు చేసి విస్తృత తనిఖీలు చేసింది. సంస్థ యజమాని మళ్ల విజయప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించడం ఇప్పటికీ స్థానికుల కి బాగా గుర్తుంది. దాదాపు గా నలభై ఐదు లక్షల రూపాయలు ఆయన ఇంట్లో లభ్యం అవడం విశేషం. వెల్ఫేర్‌ బిల్డింగ్స్‌ ఎస్టేట్స్‌ అండ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పేరుతో దేశవ్యాప్తంగా 87 ప్రాంతాల్లో చేపట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనికే ఆ నిధులు మళ్లించారని సీబీఐ తన రిపోర్ట్ లో కూడా పేర్కొంది. ఇది ఇప్పుడు మళ్ళ కి ఎలక్షన్ టైం లో భారీ ఇబ్బందికర పరిస్థితి ని తెచ్చిపెడుతోంది. ప్రత్యర్దులే కాకుండా జనం కూడా ఓపెన్ గా ఈ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించి నీకసలు ఎందుకు ఓటు వెయ్యాలి అన్నట్టు మాట్లాడాడం తో ఆయన ఇబ్బంది పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అని అంటున్నారు స్థానికులు. రాజధాని ప్రాంతంలో తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి, తమ నుంచి భారీగా పెట్టుబడులు సేకరించినట్లు బాధితురు తెలిపారు. డబ్బులు ముందే చెల్లించేస్త్ ముందే తమ ఇంటి స్థలం దక్కించుకోవచ్చని చాలామంది అప్పులు చేసి, ఇతర ఆస్తులు అమ్ముకుని మరీ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాము అని ఎన్నికల ప్రచార సందర్భంగా లోకల్ జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు.
Top