దేశంలోనే కొత్త రికార్డు సృష్టించిన జగన్ పార్టీ..!

Written By Xappie Desk | Updated: April 03, 2019 11:12 IST
దేశంలోనే కొత్త రికార్డు సృష్టించిన జగన్ పార్టీ..!

దేశంలోనే కొత్త రికార్డు సృష్టించిన జగన్ పార్టీ..!
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు జగన్ వర్సెస్ మిగతా అన్ని పార్టీలు గా ఉన్నాయి. ఒక్క జగన్ మినహా మిగతా రాజకీయ పార్టీ నేతలంతా జగన్ నే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న క్రమంలో అధికారంలో జగన్ ఉన్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇంతగా ఆంధ్ర రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీ పార్టీ హవా గురించి దేశ రాజధాని న్యూఢిల్లీలో కథలు కథలుగా చెప్పుకుంటూనట్లు సమాచారం.
 
ఇటీవల దేశ రాజ‌ధాని న్యూఢిల్లీకి కూడా వైఎస్ జ‌గ‌న్ మేనియా పాకింద‌ని వీడీపీ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో వీడీపీ స‌ర్వేపై సైతం ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లుగుతోంది. ఇక వీడీపీ చేసిన స‌ర్వేలో తేలిన మ‌రికొన్ని వాస్త‌వాల‌ను ప‌రిశీలిస్తే, త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో ఏపీలో అత్య‌ధిక సీట్లు సాధించి దేశంలోనే అతిపెద్ద మూడో పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ‌త‌రించ‌బోతుంద‌ని వీడీపీ స‌ర్వే బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతోంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా స్థాపించ‌బ‌డిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే తొమ్మిది వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంది.
 
మరియు అదే విధంగా వైసీపీ పార్టీ రెండోసారి సార్వత్రిక ఎన్నికలను ప్రస్తుతం ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొదటి సారి ఎన్నికల్లో కేవలం రెండు పర్సెంటేజ్ ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన జగన్ ఈసారి 2019 ఎన్నికల్లో ఏకంగా 20 పార్లమెంటు స్థానాలు గెలవటం ఖాయమని సర్వే ఆధారాలతో సహా పేర్కొంది. మరియు అదే విధంగా దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీల్లో వైసీపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంద‌ని వీడీపీ స‌ర్వే సంస్థ పేర్కొంది.
Top