గుడివాడ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన కొడాలి నాని..!

Written By Xappie Desk | Updated: April 03, 2019 11:18 IST
గుడివాడ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన కొడాలి నాని..!

గుడివాడ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన కొడాలి నాని..!
 
ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా 2019 ఎన్నికలలో ఎగర వెయ్యాలి అని టిడిపి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. దీంతో విజయవాడ ప్రాంతానికి చెందిన దేవినేని అవినాష్ ని కొడాలి నాని పై పోటీకి రంగంలోకి దింపారు.
 
అయితే ఎప్పటినుండో కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుండి వరుసగా గెలుస్తున్న నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలలో కూడా గెలవడం ఖాయం అని నియోజకవర్గంలో వినబడుతున్న టాక్. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొడాలి నాని తెలుగుదేశం పార్టీపై మరియు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే హామీలు ఇస్తారని ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేర్చారని ఆయన ఇచ్చే హామీలన్నీ అబద్దపు హామీలే అని సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
అలాగే తనపై గుండాగిరి చేసే దేవినేని నెహ్రు కుమారున్ని నిలబెట్టారని, తనకి పోటీగా చంద్రబాబు ఎవ్వరిని నిలబెట్టినా సరే గెలిచి తీరుతానని గుడివాడ గడ్డ మీద నన్ను ఓడించే దమ్ము టీడీపీకి లేదని గట్టి కౌంటర్లు ఇచ్చారు.అలాగే చంద్రబాబుకి మైండ్ ఏమి పని చేయట్లేదని, వంగవీటి రంగా గారిని హత్య చేయించిన వ్యక్తి దేవినేని నెహ్రూ అని ఇప్పుడు అతని కొడుకునే తనపై పోటీకి చంద్రబాబు నిలబెట్టారని గుడివాడలో తాను గెలిచి చూపిస్తానని చంద్రబాబుపై నాని సంచలన వ్యాఖ్యలు చేసారు.
Top