జనం లేక వెనుదిరిగి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..?

Written By Xappie Desk | Updated: April 03, 2019 11:39 IST
జనం లేక వెనుదిరిగి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..?

జనం లేక వెనుదిరిగి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..?
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు. అయితే రాజకీయాల్లో అడుగు పెట్టాక పవన్ కళ్యాణ్ క్రేజ్ కొంచెం తగ్గింది అని ఇటీవల ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తుంది. గత సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్రేజ్ ను ఆధారం చేసుకుని ఆ సమయంలో కొత్తగా ఎక్కువ యువత ఓటర్లు నమోదవడంతో పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు అద్భుతమై చాణిక్య రాజకీయాన్ని ప్రదర్శించారు.
 
అయితే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పై ఎక్కువ అవినీతి ఆరోపణలు వచ్చిన క్రమంలో చంద్రబాబు కి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రశ్నించిన దాఖలాలు గత నాలుగు సంవత్సరాలు లేకపోవడంతో ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ఉపసంహరించుకుని స్వతంత్రంగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచే చోట్ల తన పార్టీ జనసేన పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి చంద్రబాబుతో చీకటి ఒప్పంద రాజకీయాలు చేస్తున్నారని కామెంట్లు వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ పై ఆయన వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంలో ఉన్న ప్రజలు విసుగు చెందుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలకు కొన్ని చోట్ల జనం ఆశించినంత మేర రాలేదని సభలు రద్దు చేసుకున్నారని ఓ ప్రముఖ పత్రికలో ఒక వార్త వచ్చింది. ఆ కదనం ప్రకారం విశాఖ జిల్లా చోడవరం, అనకాపల్లి, పెందుర్తిలో పవన్‌ ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో సభలకు తరలివచ్చిన జనం నిరాశతో వెనుదిరిగారు. జనం బాగా తక్కువగా ఉండటం వల్లే సభలను రద్దు చేసినట్టు సమాచారం అని ఆ వార్తలు తెలిపాయి. మొత్తం మీద ఎన్నికల పవన్ కళ్యాణ్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top