ఎన్నికలకు వారం ముందు తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ..?

Written By Xappie Desk | Updated: April 05, 2019 12:14 IST
ఎన్నికలకు వారం ముందు తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ..?

ఎన్నికలకు వారం ముందు తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ..?
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ముఖ్యంగా మూడు పార్టీల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు కనబడుతున్న ఎక్కువగా వైసిపి టిడిపి పార్టీ ల మధ్య పోటా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం రాబోతున్న ఎన్నికల్లో ఓడిపోవడం గ్యారెంటీ అని చంద్రబాబుని ఆంధ్ర ప్రజలు నమ్మడం లేదని సర్వేల ఫలితాలు చెబుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వైసిపి పార్టీ కండువా కప్పుకోవడానికి ఎగబడుతున్నారు.
 
ఇప్పటికే కొన్ని చోట్ల చాలా మంది టిడిపి నాయకులు వైసీపీ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు వైసీపీ పార్టీ లోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వారు ఎవరు అనగా వైయస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసి తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారిన సాయి ప్రతాప్ రెడ్డి మరొకరు మాజీ అమలాపురం పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్ష కుమార్.
 
ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఈ ఇద్దరు నేతలు రాజీనామా కూడా చేశారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఈ ఇద్దరు నేతలకు ఇస్తానన్న టికెట్లు ఇవ్వకపోవడంతో చంద్రబాబు నమ్మించి మోసం చేయడంతో వైసీపీ పార్టీ లోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు సాయి ప్రతాప్ రెడ్డి మరియు హర్ష కుమార్.తాజాగా వీరిద్దరు వైసీపీ పార్టీ లోకి వస్తున్నారన్న వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు డబుల్ షాక్ తగిలింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top