ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన మాయావతి..!

Written By Xappie Desk | Updated: April 05, 2019 12:18 IST
ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన మాయావతి..!

ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన మాయావతి..!
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇంకా చీకటి ఒప్పందాలు చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని కావాలని ప్రజల ముందు విడిపోయినట్లు నటిస్తున్నారని ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే కామెంట్లు చేస్తూ ఉన్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ వాది పార్టీ (బి ఎస్ పి) పార్టీతో పొత్తు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతి తో కలిసి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశానికి ఒక దళిత ప్రధాని అయితే అది చూడాలని ఉందని తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో దళితుడే ముఖ్యమంత్రి అవుతారని ఆ సందర్భంలో కెసిఆర్ అన్నారు అని కానీ తర్వాత చూస్తే మొత్తం మారిపోయింది అని అన్న పవన్ కళ్యాణ్...ప్రచారంలో ఎక్కువగా వైసీపీ పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేసి సంచలన కామెంట్ చేశారు.
 
ఎక్కడా కూడా చంద్రబాబు పేరు ప్రస్తావనకు రాకుండా వైసీపీ పార్టీ నీ టార్గెట్ చేస్తూ మరి అదేవిధంగా కేసీఆర్ జగన్ జోడి అంటూ చంద్రబాబుపై మాట కూడా పడకుండా పక్కన పెట్టేశారు. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తో ప్రచారంలో ఉన్న మాయావతి పవన్ కి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రచారాల్లో పవన్ చంద్రబాబు ని పక్కన పెట్టినప్పటికీ మాయావతి మాత్రం చంద్రబాబు ని టార్గెట్ చేసి తన ప్రచారాన్ని కొనసాగించింది. కానీ మాయావతి జగన్ని కానీ, కేసీయార్ ని కాని పల్లెత్తు మాట అనకపోవడం విశేషం. మొత్తానికి ఏపీలో మాయావతిని తీసుకువచ్చి పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలనుకున్న పవన్ కి మాయా వ్యూహం అర్ధంకాకుండా పోయిందని అంటున్నారు.
Top