ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ పార్టీకి చెందిన నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తే అక్రమ అరెస్టు చేస్తున్నారని మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు అని వైసిపి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో తెలంగాణ పోలీసులు ప్రతీ చోట ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైటెక్ సిటీ నుండి సీనియర్ నటుడు టీడీపీ ఎంపీ మురళీమోహన్ కి సంబంధించిన రెండు కోట్ల రూపాయలు సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా కేసు కూడా మురళీ మోహన్ పై నమోదు చేశారు. మాదాపూర్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో పోలీసులకళ్లుగప్పి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి తరలిస్తున్న రూ.2 కోట్లును సీజ్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలకు శ్రీహరి.. పండరి అనే వ్యక్తులు హైటెక్ సిటీలో అనుమానాస్పదంగా కనిపించారని.. వారి వద్ద ఉన్న బ్యాగుల్ని తనిఖీ చేయగా రూ.2 కోట్ల మొత్తం దొరికినట్లుగా పేర్కొన్నారు. పట్టుబడిన వారు జయభేరి సంస్థలో పనిచేసె ఉద్యోగులు జగన్మోహన్.. ధర్మరాజులు వారికి డబ్బులు ఇచ్చినట్లుగా నిందితులు పేర్కొన్నారని.. ఈ డబ్బు కోసం యలమంచిలి మురళీకృష్ణ.. మురళీమోహన్ లు రాజమండ్రిలో ఎదురుచూస్తున్నట్లుగా వారు చెప్పారన్నారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో అజ్ఞాతంలోకి మురళీమోహన్ వెళ్లిపోయినట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.