జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు విని నోరెళ్లబెట్టిన దళితులు…?

Written By Xappie Desk | Updated: April 05, 2019 12:36 IST
జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు విని నోరెళ్లబెట్టిన దళితులు…?

జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు విని నోరెళ్లబెట్టిన దళితులు…? ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి నగరంలో ప్రచారం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా చంద్రబాబును టార్గెట్ చేయకుండా జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ జగన్ దళిత ద్రోహి అన్నట్టుగా దళితులను చిన్నచూపు చూస్తున్నట్టుగా ఆ తరహాలో పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ...జగన్ తిరుమలకు చెప్పులేసుకుని వెళతారని, ప్రోటోకాల్ పాటించరని మండిపడ్డారు. తానేదో మహానుభావుడ్ని అన్నట్టుగా జగన్ భావిస్తుంటారని పవన్ ఆరోపించారు.
 
అంతే కాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడితే దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ మనుషులకు విలువ ఇవ్వరని, సీమలో వారి ఇళ్ల మధ్య నుంచి ఎవరైనా వెళ్లాలంటే నేటికీ చెప్పులు చేతపట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. వైసీపీ నేతలు వాళ్ల కుటుంబాలు బాగుంటే సరిపోతుందని భావిస్తున్నారని, ఇకపై వాళ్లు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలు విన్న చాలా మంది దళితులు పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లలో వాస్తవం లేదని...జగన్ గారి కుటుంబం లో చాలామంది దళితులు ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా జగన్ తాత రాజారెడ్డి ఒక దళిత మహిళను వివాహం చేసుకున్నారని ఆమె పేరు జయమ్మ అని అన్నారు.
 
నిజం చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డిని కన్నది ఒక దళిత మహిళ అని జగన్ నానమ్మ ఒక దళిత స్త్రీ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సిగ్గు లేకుండా దళితులను చిన్నచూపు చూస్తూ జగన్పై దళిత ద్రోహి ముద్రలు వేసే కామెంట్లు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వాస్తవాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుంటుంది అంటూ పేర్కొన్నారు. ఇదే క్రమంలో తన పార్టీకి సంబంధించిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ప్రకటించే సమయంలో కూడా తన పక్కన ఒక సామాన్య దళితుడైన పేద కుటుంబానికి చెందిన నందిగం సురేష్ ని కూర్చోబెట్టి లిస్టు చదివించిన ఒక గౌరవం కలిగిన నాయకుడు అని జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు దళితులు.
 
మరియు అదే విధంగా జగన్ కూడా తన పాదయాత్రలో దళితుల గురించి మాట్లాడుతూ నా మేనత్త నా మేనమామ దళితులని...వాళ్లు నా బంధువులు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని మీడియా సాక్షిగా చెప్పారని ఇటువంటివి పవన్ కళ్యాణ్ కి గుర్తు ఉండవా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు దళితులు. రాజకీయంగా దళితులను అడ్డంపెట్టుకుని పైకి రావాలని పవన్ కళ్యాణ్ ఇటువంటి కామెంట్లు చేస్తున్నారని మాట్లాడుతూ అసలు దళితులుగా పుట్టకూడదు అని కామెంట్ చేసిన చంద్రబాబు ని ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని ఈ సందర్భంగా కొంత మంది దళితులు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ జగన్ను ఉద్దేశించి దళితుల వ్యతిరేకి అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు విన్న దళితులు నోరెళ్లబెట్టారు.
Top